ప్రజా సమస్యల పోరాటంలో జైలుకు వెళ్లేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా.. రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. పొద్దున లేస్తే మొదలు కేటీఆర్, కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులను వ్యక్తిగతంగా తిట్టడమే కాకుండా.. ఇబ్బందికి గురి చేసేలా ఫోన్ టాపింగ్, ఫార్ములా రేస్, కాలేశ్వరం అంటూ రోజులు గడిపేస్తున్నారన్నారని ఎమ్మెల్యే మాధవరం మండిపడ్డారు.
బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్ పల్లిలో మాట్లాడుతూ… ‘కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ నాయకులు పొద్దున లేస్తే మొదలు కేటీఆర్, కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నాయకులను వ్యక్తిగతంగా తిట్టడమే కాకుండా ఇబ్బందికి గురి చేసేలా ఫోన్ టాపింగ్, ఫార్ములా రేస్, కాలేశ్వరం అంటూ రోజులు గడిపేస్తున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఇస్తున్న చెక్కులు కూడా మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అది కాంగ్రెస్ నేతలు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే తప్ప.. పాలన చాతకాదు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, దాడులకు దిగడం వంటివి కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. తమ సహనాన్ని పరీక్షిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు.
Also Read: ENG vs IND: అర్ష్దీప్ సింగ్ ఔట్.. టీమిండియాలోకి సీఎస్కే నయా బౌలర్ ఎంట్రీ!
‘ప్రజా సమస్యల పోరాటంలో జైలుకు వెళ్లేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఇస్తానన్న హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా. మా హయాంలో మంజూరైన ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, ఎస్టీపీలు మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోనే ప్రారంభించారు. ఇప్పుడు వాటికి రంగులద్ది తమయని అంటున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయల హౌసింగ్ బోర్డ్ స్థలాలను అమ్మకానికి పెడుతున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఒక్క హౌసింగ్ బోర్డు స్థలం కూడా అమ్మలేదు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మూడు వేల కోట్లకు హౌసింగ్ బోర్డ్ స్థలాలను అమ్మారు. మరలా ఇప్పుడు డబ్బుల కోసం వేల కోట్ల రూపాల విలువ చేసే భూములు అమ్ముతున్నారు’ అని ఎమ్మెల్యే మాధవరం ఫైర్ అయ్యారు.