Aunty Video Call: ప్రస్తుతం సమాజంలో డబ్బులు సంపాదించే పద్ధతులు మారిపోయాయి. ఒకప్పుడు కష్టపడితేనే డబ్బు అనుకునేవారు. కానీ, ఇప్పుడు టెక్నాలజీని అడ్డం పెట్టుకొని ఎదుటివారిని మోసం చేసి సింపుల్ గా డబ్బు గుంజడం అలవాటు చేసుకున్నారు చాలామంది. కొన్ని ట్రిక్కులు నేర్చుకొని.. ఎదుటివారి బలహీనతల మీద కొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అందులో ఒకటి హానీ ట్రాప్. అమ్మాయిలను, ఆంటీలను వలలుగా వేసి.. మగవారి బలహీనత మీద కొట్టి డబ్బు గుంజుతున్నారు కొన్ని ముఠాలు. తాజాగా ఇలాంటి హానీ ట్రాప్ కే బలయ్యాడు ఒక వ్యక్తి. ఆ ట్రాప్ పడి ఆరున్నర లక్షలు వదిలించుకున్నాడు. పరువు పోతుందని.. చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోలీస్ స్టేషన్ లో సహాయం చేయమని చేతులు కట్టుకొని కూర్చున్నాడు.మరీ ఆ వ్యక్తిను బలిచేసిన ఆ ఆంటీ కథ ఏంటో చూద్దాం రండి.
ముంబయికి చెందిన 39 ఏళ్ల వ్యక్తికి మార్చి 17న అకస్మాత్తుగా ఒక వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ లో కత్తిలాంటి ఆంటీ కనిపించింది. ఇక ఆంటీ ఎవరో అని కూడా చెప్పకుండా మత్తెక్కించే మాటలతో రెచ్చగొట్టింది. అసలు ఆమె ఎవరో కూడా తెలియకుండా సదురు వ్యక్తి ఆంటీ అలా మాట్లాడేసరికి రెచ్చిపోయి.. మరింత చొంగ కార్చుకున్నాడు. అదే వాడు చేసిన తప్పు అని తరువాత తెలిసి వచ్చింది. ఇక ఆంటీ నిదానంగా బట్టలు విప్పడం మొదలుపెట్టింది. దీంతో మనోడు కూడా బట్టలు పూర్తిగా విప్పి నగ్నంగా నిలబడ్డాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి బట్టలు విప్పి నిలబడ్డాడో కాల్ కట్ అయ్యింది. వెంటనే మరొక కాల్ వచ్చింది. నీ నగ్న వీడియో నా దగ్గర ఉంది అంటూ ఒక వ్యక్తి కాల్ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. అప్పటికే చెమటలు పట్టి పులుసు మొత్తం కారిపోయిన ఆ వ్యక్తికీ ఢిల్లీ కమిషనర్ అంటూ మరొకరు కాల్ చేసి.. నీ నగ్న వీడియో నా దగ్గర ఉంది. అర్జెంట్ గా రూ. 50 వేలు పంపకపోతే నీ మీద కేసు వేసి అరెస్ట్ చేస్తాను అని చెప్పగానే భయపడిన అతను డబ్బు పంపాడు. ఇలా మార్చి 18వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు పలు దఫాలుగా సుమారు ఆరున్నర లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. అయినా వారి నుంచి ఫోన్లు ఆగకపోయేసరికి డబ్బులు లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 15 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ 420 సహా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.