Zaheer Khan: ఓటమిని అంగీకరిస్తున్నాం.. మాకు ఇంకా ఆరు మ్యాచ్‌లు ఉన్నాయి!
- పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో ఎల్ఎస్జీ ఓటమి
- పిచ్ విషయంలో ఫోకస్ పెడతాం
- తప్పకుండా లక్నో అభిమానులను అలరిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత మైదానం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఓడిపోవడం తమను బాధించిందని లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మెంటార్ జహీర్ ఖాన్ తెలిపాడు. హోం గ్రౌండ్స్‌లో తమకు ఇంకా ఆరు మ్యాచ్‌లు ఉన్నాయని, తప్పకుండా అభిమానులను అలరిస్తామని చెప్పాడు. ఎకానా క్రికెట్ స్టేడియం తమకు హోం గ్రౌండ్ అయినప్పటికీ.. పంజాబ్ కింగ్స్ క్యురేటర్ ఇక్కడ ఉన్నట్లు అనిపించిందన్నాడు. తప్పకుండా రాబోయే మ్యాచుల్లో విజేతగా నిలుస్తాం అని జహీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్ఎస్జీ ఓడిపోయింది.
గాయాలతో ఎల్ఎస్జీ పేస్ విభాగం కాస్త బలహీనంగా ఉన్నప్పుడు.. స్పిన్‌కు అనుకూలంగా పిచ్‌ను తయారుచేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వెలువడ్డాయి. వీటిపై ఎల్ఎస్జీ మెంటార్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ… ‘సొంత మైదానంలో ఈ ఫలితం నిరాశపర్చింది. టీమ్‌లు అన్ని తమ హోం గ్రౌండ్లో పిచ్‌ను అనుకూలంగా తయారుచేసుకుంటాయి. లక్నో పిచ్ క్యూరేటర్ మాత్రం అలా ఆలోచించినట్లు లేదనిపిస్తోంది నాకు. పంజాబ్ క్యూరేటరే ఈ పిచ్ రూపొందించినట్లుంది. ఈ అంశాలపై మేం ఫోకస్ పెడతాం. పిచ్ విషయంలో ఇకపై పొరపాట్లు జరగవని ఆశిస్తున్నా’ అని చెప్పాడు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Also Read: Shreyas Iyer Record: ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ చరిత్ర.. ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్!
‘అభిమానులు మామీద ఎన్నో అంచనాలు పెట్టుకొని మైదానానికి వస్తారు. తొలి మ్యాచ్‌లోనే జట్టు ఓడిపోవడం వల్ల చాలా నిరాశపడ్డారు. అభిమానులను నిరుత్సాహానికి గురి చేయడం సరైంది కాదు. జట్టులో ఎలాంటి సమస్యలు లేవు. ఓటమిని మేం అంగీకరిస్తున్నాం. పాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతాం. మాకు ఇక్కడ ఇంకా ఆరు మ్యాచ్‌లు ఉన్నాయి. అభిమానులను తప్పకుండా అలరిస్తాం. ఇలాంటి టోర్నీలలో పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండాలి. పరుగులు చేయాలనే ఆకలి ఉన్న క్రికెటర్లను ప్రోత్సహించాలి. ఆటలో ప్రతిఒక్కరి భాగస్వామ్యం కీలకంగా ఉంటుంది. వచ్చే మ్యాచ్‌లలో విజేతగా నిలుస్తాం’ అని జహీర్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!