LSG vs DC: ఐపీఎల్‌లో నేడు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతోంది. ఇక టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. టాస్ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ఈరోజు మోహిత్ శర్మ స్థానంలో దుష్మంత చమీరకు అవకాశం ఇచ్చామని తెలిపాడు. మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఈ మ్యాచ్‌లో మరోసారి అందరి కళ్లు కెఎల్ రాహుల్‌పైనే ఉన్నాయి. గత సీజన్‌లో లక్నో కెప్టెన్‌గా ఉన్న రాహుల్ నుండి అతని జట్టు చాలా ఎక్కువ అంచనాలను కలిగి ఉంది. రాహుల్ కూడా తన పాత జట్టు ముందు తనను తాను మరోమారు నిరూపించుకోవాలనుకుంటున్నాడు. ఇక పాయింట్ల పట్టికలో లక్నో, ఢిల్లీ రెండూ 10 పాయింట్లతో ఉన్నాయి. ఢిల్లీ ఏడు మ్యాచ్‌లు ఆడగా, లక్నో ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. అయితే, లక్నో ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తనను తాను బలోపేతం చేసుకోవాలనుకుంటుంది. ఇక నేటి మ్యాచ్ లో ఇరుజట్ల ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI :
అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, KL రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విపరాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్
ఇంపాక్ట్ ప్లేయర్స్: జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, సమీర్ రిజ్వీ, డోనోవరా ఫెరీరా, మాధవ్ తివారీ, త్రిపూర్ణ విజయ్.
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI:
ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్
ఇంపాక్ట్ ప్లేయర్స్: ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్