LPG Price Hike: ‘ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న’.. ఇప్పుడు ఈ పాట ప్రతి ఇంట్లో పాడుకుంటున్నారు. ప్రభుత్వాల పుణ్యమాని సామాన్యులు ప్రస్తుతం బతికేలా కనిపించడం లేదు. వచ్చే అరకొర జీతాలతో కుటుంబం గడవడమే కష్టంగా మారుతోంది. పెరిగిన ధరలకు వంటగది నిండుకుంది. చికెన్, మటన్ లకు ప్రజలు ఎప్పుడో దూరమైపోయారు. టమాటా మంట పుట్టిస్తోంది. ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. కారం మండుతోంది. పప్పు పట్టుకుంటేనే షాక్ కొడుతోంది. ఇలా ప్రతీ ఒక్కటీ సామాన్యులకు దూరమైపోయాయి. ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. కనీసం ఒకపూట తిండి దొరకడమే కష్టమవుతోంది. మళ్లీ గ్యాస్ సిలిండర్ బాదుడు మొదలైంది.
జూలై నెల ప్రారంభమైన మూడు రోజుల తర్వాత చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. కంపెనీలు కమర్షియల్ LPG సిలిండర్ ధరను పెంచేసాయి. ఇప్పుడు ఈ 19 కిలోల గ్యాస్ వాల్ బ్లూ సిలిండర్ ధర రూ.7 మేర పెరగనుంది. ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ ధరలను పెంచనప్పటికీ, త్వరలోనే కంపెనీలు డొమెస్టిక్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా పెంచనున్నాయని భావిస్తున్నారు.
Read Also:Viral: భార్య ఎక్కిన విమానం రావడం ఆలస్యం.. వారందరికి షాక్ ఇచ్చిన భర్త
సాధారణంగా ఎల్‌పీజీ ధరల్లో మార్పును నెల మొదటి తేదీన ప్రకటిస్తారు. అయితే ఈసారి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మూడు రోజుల తర్వాత ఈ మార్పు చేశాయి. వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.7 పెరిగింది. ఈ సిలిండర్ ఇప్పుడు ఢిల్లీలో రూ.1,773కి బదులుగా రూ.1,780కి అందుబాటులో ఉంటుంది. వాణిజ్య సిలిండర్ ధర ముంబైలో రూ.1,725 నుంచి రూ.1,732కి, కోల్‌కతాలో రూ.1,875.50 నుంచి రూ.1,882.50కి, చెన్నైలో రూ.1,937 నుంచి రూ.1,944కి పెరిగింది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత రెండు నెలలుగా కమర్షియల్ గ్యాస్ ధరను నిరంతరం తగ్గిస్తూనే ఉన్నాయి. మే నెలలో వాణిజ్య సిలిండర్ ధర రూ.172 తగ్గగా, జూన్‌లో రూ.83.5 తగ్గింది. ఇప్పుడు మళ్లీ పెంచారు. ఇప్పుడు అందరి చూపు దేశీయ వంటగ్యాస్ ధరలపైనే ఉంటుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా కంపెనీలు మారుస్తాయన్న భయాందోళన నెలకొంది.
Read Also:Telangana Congress: రేపటి నుంచి టీ కాంగ్రెస్ యువ పోరాట యాత్ర..?