Thalaivar 171 :’తలైవా 171′ షూటింగ్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ చిత్రంతో తిరుగులేని విజయం అందుకున్నారు. జైలర్ సినిమా రజనీ కి కమ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలిచిపోయింది..ప్రస్తుతం రజనీకాంత్ తలైవా 170 సినిమా తో బిజీగా ఉన్నారు.. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశ లో ఉంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం లో తలైవా 171 సినిమాకు కూడా రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఖైదీ, విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల ను తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్-రజినీకాంత్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని ఎప్పుడు స్టార్ట్ అవుతుందా.. ఎప్పుడు అప్‌డేట్‌లు ఇస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఎక్జయిటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఒక సాలిడ్ అప్‌డేట్ వచ్చింది.
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ రీసెంట్‌గా ‘అవల్ పెయిర్ రజనీ’ అనే తమిళ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో అభిమానులు తలైవా 171 అప్‌డేట్ గురించి అడుగగా లోకేశ్ కనగరాజ్ స్పందిస్తూ.. 2024 ఏప్రిల్ నుంచి ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నట్లు లోకేష్ తెలిపాడు. ప్రస్తుతం కథ రాసుకుంటున్నాను.త్వరలోనే కథ పూర్తి చేసి ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపాడు.ఈ చిత్రాన్ని లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.రజినీకాంత్ మరోవైపు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్‌లో లాల్‌సలామ్ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2024 పొంగళ్ కానుక గా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో విలన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో రాఘవా లారెన్స్ నటిస్తున్నాడని సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ న్యూస్‌పై అధికారికం గా అనౌన్స్మెంట్ ఏమి రాలేదు. కానీ త్వరలోనే మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!