కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన నగరం సినిమాతో తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అడుగుపెట్టిన లోకేష్ తోలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.కార్తీతో చేసిన ఖైదీతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారాడు. విజయ్ తో మాస్టర్, కమల్ హాసన్ విక్రమ్ తో స్టార్ డైరెక్టర్స్ లో నంబర్ వన్ పొజిషన్ కు చేరుకున్నాడు లోకేష్ కనగరాజ్. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమాతో మరొక హిట్ అందుకున్నాడు.
కాగా ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకుడి నుండి హీరోగా మారబోతున్నాడు. డైరెక్షన్ చేసి బోర్ కొట్టిందేమో హీరోగా టర్న్ అయ్యాడు. ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ హీరోగా సినిమా రూపొందుతోంది. గత కొన్ని నెలలుగా స్క్రిప్ట్ వర్క్ లో బిజిగా ఉన్న టీమ్ ఫైనల్ స్క్రిప్ట్ ను లాక్ చేసి షూటింగ్ కు రెడీ అయింది. ఈ రోజు చెన్నైలో అధికారకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెగ్యులర్ షూటింగ్ ను వెంటనే స్టార్ట్ చేసి చక చక షూట్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దర్శకుడిగా తమిళ అగ్ర హీరోలను డైరెక్ట్ చేసి హిట్స్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ ఇప్పుడు హీరోగా కూడా సక్సెస్ కావాలని ఆశిద్దాం. కన్నడ భామ రచిత రామ్, తమిళ్ బ్యూటీ మిర్న మీనన్ లోకేష్ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు.