తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా నాలుగోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అరగంట ముందే పోలింగ్ కేంద్రానికి భారీగా జనాలు వచ్చారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తెలంగాణలో ఓటు…