Mallikarjun Kharge: భయపడే నేత దేశానికి మంచి చేయలేరు: మల్లికార్జున ఖర్గే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge on PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు భయపడి మణిపుర్ వెళ్లలేదని, తమ నేత రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. భయపడే నేత దేశానికి మంచి చేయలేరని విమర్శించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ప్రజలు ఏకమై పోరాడి మోడీ ని గద్దె దించాలని ఖర్గే పిలుపునిచ్చారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఢిల్లీలో మేనిఫెస్టోను ప్రకటించారు.
మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… ‘కాంగ్రెస్ మేనిఫెస్టోను పేదలకు అంకితం చేస్తున్నాం. దేశ రాజకీయ చరిత్రలో న్యాయ పత్రాలుగా దీన్ని ప్రజలు గుర్తుంచుకుంటారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో అందిస్తామన్న ఐదు న్యాయాలు, 25 గ్యారంటీలు మేనిఫెస్టోలో ఉన్నాయి. మేం చేయగలిగిన అంశాలనే మేనిఫెస్టోలో చేర్చాం. ప్రధాని మోడీ హయాంలో ఒక్కటైనా పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చారా?. కేవలం తిట్లు తప్పితే.. మోడీ పాలనలో మరేమీ వినలేదు’ అని అన్నారు.
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
Also Read: Sumalatha Ambareesh: బీజేపీలో చేరిన సీనియర్ నటి సుమలత!
‘మోడీ సర్కార్ విపక్ష నేతలను జైళ్లలో పెడుతున్నారు. ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం లేదు. కాంగ్రెస్ పార్టీపై రూ.3,500 కోట్ల జరిమానాలు విధించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ప్రజలు ఏకమై పోరాడి మోడీని గద్దె దించాలి. కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి.. పార్టీ హామీలును వారికి వివరించాలి. అవినీతిపరులను పార్టీలో చేర్చుకొని.. బీజేపీ మమ్మల్ని నిందిస్తోంది. ప్రధాని ఇప్పటివరకు భయపడి మణిపుర్ వెళ్లలేదు. మా నేత రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లారు. భయపడే నేత దేశానికి మంచి చేయలేరు’ అని ఖర్గే విమర్శించారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!