Guvvala Balaraju: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేవలం కేసీఆర్ ఒక్కరే పోరాటాలు చేశారా? అని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తాజాగా ఎన్టీవీ క్వశ్చన్ హవర్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది పోరాటం చేశారు. అయినప్పటికీ కేసీఆర్ పట్టువిడవకుండా పోరాటం చేశారని ప్రశంసిస్తూ వచ్చానన్నారు. కేసీఆర్ బిక్ష వల్లే ఎమ్మెల్యే అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ లేకుంటే.. కేసీఆర్ లేకుంటే మీరు ఎమ్మెల్యే అయ్యేవారే కాదు. మీరు వార్డు మెంబర్‌కే సరిపోరు…
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి మలుపు అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్ఎస్ కు ప్రీ ఫైనల్స్ లాంటివని.. ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు.
KTR: తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న కాళేశ్వరం కమిషన్ విచారణ వేళ బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరికొద్దిసేపట్లో కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో కాంగ్రెస్ నేతలపై ఘాటు విమర్శలు చేసారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. Read Also: KCR Enquiry: విచారణకు హాజరుకానున్న మాజీ సీఎం.. బీఆర్‌కే భవనం వద్ద…
కేటీఆర్ అసలు రంగు బయటపడిందని.. కేటీఆర్ ట్విట్టర్ లో కాదు.. జనాల్లోకి రా అని కవిత కూడా చెప్పిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కుటుంబంలో ఉన్న సవాళ్లకు సమాధానం చెప్పుకోలేని కేటీఆర్.. ప్రజలకు ఏం చేస్తాడు? అని ఎద్దేవా చేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కవిత కామెంట్స్ తో కేసీఆర్ అసలు రంగు బయటపడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలిగిపోయిందని తెలిపారు.
Rasamayi Balakishan : కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం గార్డెన్‌లో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణ పార్టీ ఏది అంటే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ జెండానే చూపిస్తారన్నారు. దేవుడులాంటి కేసీఆర్‌ను దూరం చేసుకొని దయ్యం లాంటి రేవంత్ రెడ్డి తెచ్చుకున్నమని ప్రజలంతా బాధపడుతున్నారని, అర గ్యారెంటీ అమలు చేసి ఆరు గ్యారెంటీలు అమలు అయ్యాయని…