India vs West Indies 3rd T20 Preview and Playing 11: నేడు వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-2తో వెనుకంజలో ఉన్న టీమిండియాకు ఈ మ్యాచ్ చాలా కీలకం. సిరీస్ రేసులో నిలవాలంటే.. హార్దిక్ సేన ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. ఒకవేళ ఓడారో 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్ చేతిలో భారత్‌కు తొలి ఓటమి తప్పదు. మందకొడి పిచ్‌లపై పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ చెలరేగుతున్న విండీస్.. మూడో టీ20 గెలిచి సిరీస్ కైలాసవం చేసుకోవాలని చూస్తోంది. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
తొలి రెండు టీ20ల్లో భారత్ బ్యాటింగ్ దారుణంగా ఉంది. హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ తప్ప మిగతా బ్యాటర్లు అందరూ విడలమయ్యారు. 39, 51 పరుగులు చేసిన తిలక్ మూడో టీ20లోనూ చెలరేగాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యాలు ఇప్పటికైనా చెలరేగాల్సిన అవసరం ఉంది. బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చహల్‌లు విండీస్ బ్యాటర్లను ఆపితేనే గెలిచే అవకాశాలు ఉంటాయి.
వరుసగా రెండు టీ20ల్లో గెలిచిన వెస్టిండీస్ ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. ఇదే జోరులో మూడో టీ20లోనూ గెలిచి.. సిరీస్ పట్టేయాలని చూస్తోంది. టాప్‌ఆర్డర్ విఫలమవుతున్నప్పటికీ.. నికోలస్ పూరన్ ఒక్కడే జట్టును గెలిపిస్తున్నాడు. పావెల్, హెట్‌మయర్ బ్యాటింగ్‌లో రాణిస్తుండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక బౌలింగ్‌లో విండీస్ పటిష్ఠంగా ఉంది. జోసెఫ్, మెకాయ్, షెఫర్డ్, హోల్డర్, మేయర్స్, హొసీన్ రాణిస్తున్నారు.
Also Read: Gold Today Price: మగువలకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
తుది జట్లు (అంచనా):
భారత్: ఇషాన్, శుభ్‌మన్, సూర్యకుమార్, తిలక్, శాంసన్/జైస్వాల్, హార్దిక్, అక్షర్, బిష్ణోయ్/కుల్దీప్, అర్ష్‌దీప్, చహల్, ముకేశ్/అవేష్. వెస్టిండీస్: కింగ్, మేయర్స్, ఛార్లెస్, పూరన్, పావెల్, హెట్‌మయర్, షెఫర్డ్, హోల్డర్, అకీల్, జోసెఫ్, మెకాయ్.