దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ లిజెల్ లీ ఆదివారం మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL) 2024లో అరంగేట్రం చేసింది. హోబర్ట్ హరికేన్స్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్ మ్యాచ్‌లో అజేయంగా 150 పరుగులు చేసి అద్భుత రికార్డు సృష్టించింది. హోబర్ట్ హరికేన్స్ తరుఫున ఆడుతున్న లీజెల్.. సిడ్నీ క్రికెట్ స్టేడియంలో 75 బంతుల్లో 12 ఫోర్లు, 12 సిక్సర్లతో ఊచకోత చూపించింది. డబ్ల్యూబీబీఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్.