Liton Das Replicates MS Dhoni’s No-Look Run Out: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యుత్తమ ఫినిషర్, విజయవంతమైన కెప్టెన్ మాత్రమే కాదు.. బెస్ట్ వికెట్ కీపర్ కూడా. రెప్పపాటులో స్టంపౌట్ చేయడం మహీ ప్రత్యేకత. ఒక్కోసారి ఫీల్డర్లు విసిరే బంతులను అందుకుని.. వికెట్లను చూడకుండానే బెయిల్స్ పడేసి రనౌట్ చేస్తుంటాడు. నో-లుక్ రనౌట్ చేయడం మహీ వల్లనే సాధ్యం. ఇలా ఎందరో ట్రై చేసి.. విఫలమైన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్.. ఎంఎస్ ధోనీని తలపించాడు.
తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ చివరి బంతిని ముస్తాఫిజుర్ రెహమాన్ వేయగా.. షనక లాంగాన్ మీదుగా షాట్ ఆడాడు. సింగిల్ తీసిన షనక.. డబుల్స్‌కు ప్రయత్నించాడు. బంగ్లా ఫీల్డర్ రిషద్ హొస్సేన్ బంతిని అందుకొని కీపర్ లిటన్ దాస్‌కు విసిరాడు. బంతిని అందుకున్న దాస్.. వికెట్లను చూడకుండానే వెనక నుంచి బెయిల్స్‌ను పడగొట్టాడు. దాంతో షనక రానౌట్ అయ్యాడు.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ ముంబైని వీడి.. చెన్నై తరపున ఆడాలి: రాయుడు
లిటన్ దాస్ అద్భుత కీపింగ్ స్కిల్స్ చూసి మైదానంలోని ఆటగాళ్లు మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘లిటన్ దాస్ సూపర్’, ‘లిటన్ దాస్ గ్రేట్ వర్క్’, ‘ఎంఎస్ ధోనీని తలపించావ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 2016లో రాస్ టేలర్‌ను మహీ నో-లుక్ రనౌట్ చేశాడు. ఇక ఈ మ్యాచులో శ్రీలంక 28 పరుగుల తేడాతో గెలిచింది. ఛేదనలో బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది.
Liton Das does what Ms Dhoni done for the ages.
No look run-out. Liton das comes from Dhoni school of keeping and making him proud 🙀pic.twitter.com/DaiszwMnZw
— Sujeet Suman (@sujeetsuman1991) March 11, 2024