Lion Viral Video: గుజరాత్ రాష్ట్రంలోని భావ్నగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ జైన తీర్థక్షేత్రం పాలితాణాలో ఉన్న పవిత్ర శేత్రుంజయ పర్వతంపై మరోసారి మృగరాజు (సింహం) కనిపించింది. పర్వత మార్గంలో సింహం నిర్భయంగా నడుచుకుంటూ కనిపించడంతో యాత్రికుల్లో ఓవైపు ఆసక్తి, మరోవైపు భయం కూడా నెలకొంది. సింహం మెట్లపై వెళ్తున్న అరుదైన దృశ్యాలను ఓ భక్తుడు తన మొబైల్లో చిత్రీకరించగా.. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయింది.
IPL 2026కు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మాస్టర్ ప్లాన్.. బీసీసీఐని ఒప్పించి మరీ..?
సాధారణంగా శేత్రుంజయ పర్వతంపై ప్రతిరోజూ వేలాది మంది భక్తులు పాదయాత్రగా ఎక్కుతుంటారు. అయితే అకస్మాత్తుగా సింహం మార్గంపైకి రావడంతో యాత్రికులు ఆశ్చర్యానికి గురయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా కొంతసేపు యాత్రను నిలిపివేసి, సింహానికి మార్గం ఇచ్చారు. దీనితో ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లిన సింహాన్ని చూసిన భక్తులు ఈ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. ఇటీవలి కాలంలో పాలితాణా పరిసర ప్రాంతాలు, శేత్రుంజయ పర్వత ప్రాంతాల్లో అడవిజంతువుల సంచారం పెరిగినట్లు సమాచారం. ఈ పర్వతాలు, చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాలు సింహాలకు అనుకూలమైన నివాసంగా మారుతున్నాయి. తరచూ ఇక్కడ సింహాలు, చిరుతపులులు దర్శనమిస్తున్నాయి.
Salman Khan: మరో ఆరు రోజుల్లో 60వ పుట్టినరోజు.. ఆ ఫిట్నెస్ ఏంటి భాయ్..!
అరణ్యశాఖ అధికారులు తెలిపిన ప్రకారం.. ఈ ప్రాంతంలో నీరు, ఆహారం సమృద్ధిగా లభించడంతో సింహాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇది ప్రకృతి సమతుల్యతకు మంచి సంకేతమని వారు పేర్కొన్నారు. అయితే యాత్రికులు జాగ్రత్తలు పాటించాలని, అటవీ అధికారుల సూచనలను అనుసరించాలని సూచించారు.
What will you do… Go up or down ??
(from Palitana, 22-12-2025) pic.twitter.com/Oh5nx4bNaS
— MarketWisdombyNSFidai (@nsfidai) December 22, 2025