Lexus RX 350h Exquisite: లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ (Lexus) భారతదేశంలో RX సిరీస్ ను అప్డేట్ చేస్తూ కొత్త RX 350h ఎక్స్‌క్విజిట్ (Exquisite) ట్రిమ్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త కారు ధర రూ. 89.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. కొత్త వేరియంట్ గతంలో ఉన్న లగ్జరీ (Luxury) ట్రిమ్ స్థానంలో వచ్చింది. అయితే ఇదివరకు మోడల్‌తో పోలిస్తే ప్రారంభ ధర ఏకంగా రూ. 6.14 లక్షలు తగ్గింది. అయితే ధర తగ్గినా మునుపటి లగ్జరీ ట్రిమ్‌లోని ముఖ్యమైన ఫీచర్లు, టెక్నాలజీ అదేవిధంగా కొనసాగుతున్నాయి.
RX 350h ఎక్స్‌క్విజిట్ లెక్సస్ సంబంధించి సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉంది. దీనిలో 2.5 లీటర్ ఇన్లైన్-4 పెట్రోల్ ఇంజిన్‌తో పాటు హై ఔట్పుట్ ఎలక్ట్రిక్ మోటార్, బైపోలార్ నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీని అందించారు. ఇందులో పవర్ ఔట్పుట్ 246 hp. ఇక క్యాబిన్లో అత్యంత ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. 14 -అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మెమరీ ఫంక్షన్‌తో 10-వే పవర్ అడ్జస్టబుల్ ముందు సీట్లు, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ముందు & వెనుక సీట్లు, వెనుక సీట్లను ఎలక్ట్రికల్‌గా రీక్లైన్ చేసే సౌలభ్యం వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఆంబియంట్ లైటింగ్, కనెక్టెడ్-కార్ టెక్నాలజీ మరియు అధునాతన భద్రతా వ్యవస్థలకు మద్దతు కూడా ఉంది.

Nubia Fold, Nubia Flip3 రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసిన నుబియా.. ఫీచర్స్ ఇవే..!
మెరుగైన ఆడియో అనుభవం కోసం RX 350h ఎక్స్క్విజిట్లో 21-స్పీకర్ Mark Levinson ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఎంపికగా అందుబాటులో ఉంది. RX 350h ఎక్స్‌క్విజిట్ Lexus ఆడియోతో రూ. 89,99,000, మార్క్ Levinson ఆడియోతో రూ. 92,02,000 ధర కలిగినది. RX 500h F-Sport+ మోడల్ మార్క్ లెవిన్సన్ ఆడియోతో రూ.1,09,46,000 ధరకు లభిస్తుంది.