ప్రకృతిని కాపాడుకుంటూ.. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పరస్పర సమన్వయంతో.. ముందుకెళ్లినపుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్న టైంకి చేరుకోవచ్చని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ అమెరికాకు బయలుదేరారు. ప్రపంచ పర్యాటకరంగ అభివృద్ధిపై ప్రసంగించేందుకు కిషన్ రెడ్డిని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆహ్వానించింది.