Leopard Hulchal again in Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. రాత్రి సమయంలో ఔటర్ రింగ్ రోడ్డులో చిరుతపులి సంచరిస్తోంది. శనివారం రాత్రి రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం దగ్గర గోడపై కూర్చుంది. ఆ చిరుతపులిని చూసి స్థానికులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. చిరుతని చూసిన స్థానికులు, యాత్రికులు ఫోటోలను తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. చిరుతపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రత్నానంద ఆశ్రమం వద్ద గోడపై కూర్చుని ఉన్న చిరుత పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: Sanitation workers: ఐదు రోజులుగా పారిశుధ్య కార్మికుల సమ్మె.. ఇళ్లల్లో పేరుకుపోతున్న చెత్త!
మూడు నెలల క్రితం ఔటర్ రింగ్ రోడ్డులోని రుద్రాపార్కు సమీపంలో గోడపై కూర్చుని చిరుతపులి కనిపించింది. మరోసారి ఇప్పుడు చిరుత కనిపించింది. దాంతో ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి చిరుత దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. శ్రీశైలంలో రోజురోజుకి చిరుత పులుల సంచారం పెరుగుతూనే ఉంది. చిరుత సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా.. పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.