Gangster Lawrence Bishnoi: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన స్నేహితుల్లో ఒకరికి ఈద్ శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. ఈ వీడియో సబర్మతి జైలుకు చెందినది కాదని తెలిపారు. ఈ వీడియో వైరల్‌గా మారిన తీరు పలు ప్రశ్నలకు తావిస్తోంది. లారెన్స్ బిష్ణోయ్‌ను సబర్మతి జైలులో ఉంచారు. ప్రత్యేక సెక్యూరిటీ సెల్‌లో ఉంచారు, అయినా మొబైల్ అక్కడికి ఎలా చేరిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Read Also: Bomb Threat Emails : ముంబైలోని 60కి పైగా సంస్థలకు బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు..
ఈద్ శుభాకాంక్షలు తెలిపే వీడియో వైరల్..
శిరోమణి అకాలీదళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజిథియా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా ప్రశ్నలు లేవనెత్తారు. లారెన్స్ మొదట పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను హత్య చేశాడని, ఇప్పుడు బిష్ణోయ్ పాకిస్థానీ గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టికి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పాడని, అది కూడా గుజరాత్ జైలు నుండి అని ఆయన రాసుకొచ్చారు. జైలులో ఉన్నా ఎంత స్వేచ్ఛగా ఉన్నాడో దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సబర్మతి జైలు అధికారులు, గుజరాత్ పోలీసులపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై గుజరాత్ పోలీసుల నుంచి తొలుత ఎలాంటి స్పందన లేదు. మధ్యాహ్నం సబర్మతి జైలు డీఎస్పీ ఈ వీడియో సబర్మతి జైలుకు చెందినది కాదని చెప్పారు. ఈ వీడియో కూడా ఏఐ జనరేట్ కావచ్చు, ఏడాదిలో మూడు ఈద్‌లు ఉన్నాయి, ఇది ఏ ఈద్ వీడియో అని చెప్పడం కష్టమని అన్నారు.
Read Also: Sukesh Chandrasekhar: తీహార్ జైలులో సుఖేష్ చంద్రశేఖర్‌కు ఎయిర్ కూలర్.. కోర్టు ఆదేశం
ప్రస్తుతం, లారెన్స్ బిష్ణోయి సబర్మతి జైలులో ఉన్నాడు. వివిధ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్ కేసులో లారెన్స్ బిష్ణోయ్‌ను గుజరాత్ ఏటీఎస్ రిమాండ్‌కు తరలించి అప్పటి నుంచి సబర్మతి జైలులో ఉంచారు. లారెన్స్‌ను పూర్తి భద్రతతో ఈ జైలులో ఉంచారు. ప్రస్తుతం అతను ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్‌ఐఏ విచారణ జరుపుతోంది.