Lava Anniversary Sale: భారతదేశపు ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 30, 2025న ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. కేవలం ఒక్కరోజు మాత్రమే లభ్యమయ్యే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, TWS ఇయర్‌బడ్స్, పవర్ బ్యాంక్‌లు వంటి అనేక గాడ్జెట్‌లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ప్రత్యేక ఆకర్షణగా మొదటి 100 మంది కొనుగోలుదారులకు మాత్రమే Lava AGNI 3 స్మార్ట్‌ఫోన్, Prowatch V1 స్మార్ట్‌వాచ్‌ను కేవలం రూ.16కే అందించనున్నారు. ఇందుకోసం AGNI 3 ఫ్లాష్ సేల్ ను మార్చి 30న మధ్యాహ్నం 12 గంటలకు, Prowatch V1 ఫ్లాష్ సేల్ సాయంత్రం 7 గంటలకు తీసుకరానున్నారు. ఈ స్పెషల్ డీల్‌ను పొందాలంటే AGNI 3 కొనేందుకు ‘AGNI3’ కూపన్ కోడ్ ఉపయోగించాలి. అలాగే Prowatch V1 కొనేందుకు ‘PROWATCH’ అనే కూపన్ కోడ్ ఉపయోగించాలి.
Read Also: IPL: 9వ స్థానంలో ధోని బ్యాటింగ్.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్.. సెటైర్స్ వేస్తున్న క్రికెటర్స్
ఇక వీటితోపాటు లావా 16వ వార్షికోత్సవ సేల్ 2025 లో భాగంగా స్మార్ట్‌ఫోన్ డీల్స్ లో Lava Agni 3 5G అసలు ధర 25,499 కాగా.. కేవలం 16,000లకే అందించనున్నారు. అలాగే Blaze Duo 5G అసలు ధర 18,999 కాగా దీనిని సేల్ భాగంగా కేవలం రూ. 13,799 కు అందించనున్నారు. ఇంకా Blaze 3 5G అసలు ధర రూ.12,999 ను కేవలం రూ. 9,899 కు అందించనున్నారు.
ఇక TWS ఇయర్‌బడ్స్, పవర్ బ్యాంక్ డీల్స్ విషయానికి వస్తే.. ఇందులో Probuds N32 అసలు ధర రూ. 2,999 కాగా కేవలం రూ. 999కే అందించనున్నారు. అలాగే Probuds N31 అసలు ధర 2,499 కాగా కేవలం రూ. 799 కే అందించనున్నారు. ఇక అలాగే Probuds T31 అసలు ధర 2,499 కాగా, కేవలం రూ. 999కే లభించనుంది. ఇక PB11 పవర్ బ్యాంక్ అసలు ధర 1,599 ఉండగా ఆఫర్ లో భాగంగా కేవలం రూ. 799కే అందించనున్నారు.
Read Also: Google Pixel 9a: ప్రీమియం ఫీచర్లతో విడుదలకు సిద్దమైన గూగుల్ పిక్సెల్ 9a
ఇక స్మార్ట్‌వాచ్ డీల్స్ విషయానికి వస్తే ఇందులో ProWatch V1 అసలు ధర రూ.4,999 ఉండగా, కేవలం రూ.1,616 లకే లభిస్తుంది. అలాగే ProWatch X అసలు ధర రూ. 6,999 ఉండగా ఆఫర్ లో కేవలం రూ.3,౭౭౯ లకే అందించనున్నారు. ఇక ProWatch ZN స్మార్ట్‌వాచ్ అసలు ధర రూ.5,999 కాగా, కేవలం రూ. 2,699కే పొందవచ్చు. ఈ లావా వార్షికోత్సవ సేల్ లావా అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో కేవలం మార్చి 30, 2025 (ఆదివారం) మాత్రమే లభ్యమవుతుంది.