Google Pixel 9a: గూగుల్ తాజాగా తన గూగుల్ Pixel 9a స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. ఈ మొబైల్ ఏప్రిల్‌లో అందుబాటులోకి వస్తుందని విడుదల తేదీని తెలిపింది. ఇక ఈ గూగుల్ Pixel 9a విడుదల వివరాలు చూస్తే.. ఏప్రిల్ 10న అమెరికా, కెనడా, యుకెలలో.. అలాగే ఏప్రిల్ 14న జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, ఫ్రాన్స్, నార్వే, డెన్మార్క్, స్వీడన్, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, పోర్చుగల్, స్విట్జర్లాండ్, పోలాండ్, చెకియా, రొమేనియా, హంగేరీ, స్లోవేనియా, స్లోవాకియా, లిథువేనియా, ఎస్టోనియా, లాట్వియా, ఫిన్లాండ్ లో విడుదల చేయనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 16న భారత్, ఆస్ట్రేలియా, సింగపూర్, తైవాన్, మలేషియాలో విధుల చేస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: Myanmar Earthquake: మయన్మార్‌లో మరోసారి భూకంపం.. 4.7గా తీవ్రత నమోదు..
ఇక గూగుల్ Pixel 9a మొబైల్ సంబంధించిన వివరాలను చూస్తే.. గూగుల్ Pixel 9a 128GB వెర్షన్‌ను USD 499 (దాదాపు రూ. 43,080)కి, 256GB వెర్షన్‌ను USD 599 (దాదాపు రూ. 51,715)లుగా ధరను నిర్ణయించారు. అయితే, భారత మార్కెట్‌లో దీని 256GB వెర్షన్ ధర రూ. 49,999గా నిర్ణయించబడింది. ఇది ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇక మొబైల్ లాంచ్ ఆఫర్‌గా రూ. 3,000 క్యాష్‌బ్యాక్, 24 నెలల పాటు నో-కాస్ట్ EMI లాంటి ప్రత్యేక ఆఫర్లను అందించనున్నారు. HDFC బ్యాంక్, IDFC బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి సంస్థల ద్వారా లభించనున్నాయి.
Read Also: RS Praveen Kumar : తెలంగాణలో రాక్షస, రాబందులు పాలన నడుస్తుంది
Google Pixel 9a స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇందులో 6.3-అంగుళాల FHD+ OLED HDR డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 2700 నిట్స్ బ్రైట్‌నెస్, గోరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లభించనున్నాయి. Google Tensor G4 ప్రాసెసర్, Titan M2 సెక్యూరిటీ చిప్ ఇందులో ఉన్నాయి. 8GB RAM, + 128GB/256GB ROM లతో 2 వేరియంట్స్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో రియర్ కెమెరాగా 48MP (f/1.7 అపర్చర్), 13MP అల్ట్రా-వైడ్ కెమెరా (f/2.2 అపర్చర్) లను అందించారు. ఇక ఫ్రంట్ కెమెరాగా 13MP ( f/2.2 అపర్చర్) ను అందించారు. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, USB Type-C ఆడియో, స్టెరియో స్పీకర్లు, 2 మైక్రోఫోన్లు లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 5100mAh బ్యాటరీకి 23W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను అందించారు.