Akhanda 2 : టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రం ‘అఖండ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 2021లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ‘అఖండ 2’ చిత్రానికి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం చైనీస్ వ్యక్తిని ఎంపిక చేస్తారని భావిస్తున్నారు. అందరికి పరిచయం ఉన్న, అద్భుతమైన నటనా అనుభవం, అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్ ఉన్న వ్యక్తికే ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. మరోవైపు ‘అఖండ 2’ సినిమాలో కీలక పాత్ర కోసం 16 నుంచి 18 ఏళ్ల అమ్మాయిని తీసుకోనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
మొదటి సినిమాకు మించి అఖండ 2 సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అఖండ విజయాన్ని మించి అఖండ 2 సాధిస్తుందని యూనిట్ నమ్మకంగా చెబుతోంది. దీంతో ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారంటూ బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. డిసెంబర్ లో అఖండ 2 షూటింగ్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ పాత్ర తాలూకు ఇంట్రడ్యూసింగ్ షాట్స్ ను తీస్తారట. మొత్తానికి ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను ఇప్పటికే ‘అఖండ 2’కు స్క్రిప్ట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ పై కసరత్తులు చేస్తున్నారు. కాగా ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీతో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Read Also:Vakati Narayana Reddy: బీజేపీ నేత వాకాటిని బెంబేలెత్తించిన నకిలీ సీబీఐ.. రూ.15 కోట్లు డిమాండ్..