Site icon NTV Telugu

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ఎలా అయ్యారో చూడండి.. కొత్త ఫొటో వైరల్!

Kodali Nani

Kodali Nani

ఏపీ వైసీపీ నేత కొడాలి నాని లేటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఆయన ఛాతికి బెల్ట్ ధరించి ఉన్నారు. హార్ట్ సర్జరీ తర్వాత నాని బయట ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నానికి సంబంధించిన ఈ ఫొటో బయటకు రావడంతో వైరల్ అవుతోంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి ఇటీవల ముంబైలో హార్ట్ ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న ఆయనకు ఆపరేషన్ జరిగింది. ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్ వైద్యులు దాదాపు 10 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. అయితే.. ఆపరేషన్ జరిగి రెండు నెలలు దాటినా కొడాలి నాని ఇప్పటికీ బయటకు రాలేదు. హైదరాబాద్ లోనే ఉంటూ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం సెట్ అవ్వలేదని.. ఈ నేపథ్యంలో మెరుగైన శస్త్ర చికిత్స కోసం అమెరికా తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

READ MORE: Kalpika Ganesh : డిస్కౌంట్ అడగలేదు.. డిసర్ట్ అడిగితే గొడవ పడ్డారు.. కల్పిక క్లారిటీ..

అదే సమయంలో ఏపీ పోలీసులు ఆయనకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ అయిన కొన్ని గంటల్లోనే హైదరాబాద్ లో జరిగిన ఓ వివాహ వేడుకల్లో నాని పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. తాజాగా నానికి సంబంధించిన మరో ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఛాతికి బ్లాక్ బెల్ట్ ఆయన పెట్టుకున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. హార్ట్ సర్జరీ నేపథ్యంలో వైద్యుల సూచనల మేరకు ఆయన ఆ బెల్ట్ పెట్టుకుని ఉంటారని తెలుస్తోంది.

READ MORE: Netanyahu: ఢిల్లీలో నెతన్యాహు వాంటెడ్ పోస్టర్లు.. కేంద్రం అప్రమత్తం

Exit mobile version