ఏపీ వైసీపీ నేత కొడాలి నాని లేటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఆయన ఛాతికి బెల్ట్ ధరించి ఉన్నారు. హార్ట్ సర్జరీ తర్వాత నాని బయట ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నానికి సంబంధించిన ఈ ఫొటో బయటకు రావడంతో వైరల్ అవుతోంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి ఇటీవల ముంబైలో హార్ట్ ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న ఆయనకు ఆపరేషన్ జరిగింది.