ఆంధ్రప్రదేశ్ లో ఫిన్ టెక్ ప్రగతి ప్రయాణం భూముల చుట్టూ తిరుగుతోంది. విశాఖలో అత్యంత ఖరీదైన భూములను 99పైసల లీజుకు కేటాయించడం తీవ్ర చర్చ నీయాంశంగా మారుతోంది. ఐటీ అభివృద్ధి, ఏకో సిస్టమ్ కోసం ప్రభుత్వం సంకల్పంకు ఈ నిర్ణయం ఉదాహరణగా అధికారపార్టీ సమర్ధించుకుంటుంటే.. భూ పందేరాల వెనుక రహస్య అజెండా ఉందని ప్రతిపక్షం అనుమానం వ్యక్తం చేస్తోంది.