Lakshmi Manchu: ఆ విషయంలో నా భర్త జంకుతాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మంచు మోహన్ బాబు తనయగా, నటిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఆదిపర్వం’, ‘దక్ష ది డెడ్లీ కాన్సిపిరసీ’ చిత్రాల్లో నటించిన ఆమె, మార్చి చివరి వారంలో ‘లేచింది మహిళా లోకం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తూ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలపై నిప్పులు చెరిగారు.
Also Read : Rakasa : రాకాస ‘ప్రీ-రిలీజ్’ షాక్.. థియేట్రికల్ హక్కులకే అన్ని కోట్లా? నిహారిక క్రేజ్ మామూలుగా లేదు!
Also Read
- CWG 2026 Medals: ఒక్క రోజులో 16 పతకాలు.. పాయింట్స్ పట్టికలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్.!
- Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
- Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
- Friendship Day 2026: ఒక బ్యాండ్.. ఎన్నో జ్ఞాపకాలు.. అసలు స్నేహితుల దినోత్సవం చరిత్ర తెలుసా?
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, మన సమాజం మహిళలను ఎలా జడ్జ్ చేస్తుందో వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ‘మగవాళ్లు ఏదైనా బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటే ప్రశంసలు కురుస్తాయి.. అదే ఆడవాళ్లు చేస్తే మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటారు. మేము చేస్తే సంసారం.. మీరు చేస్తే ఆ వ్యవహారం అనే విధంగా ఉంటుంది. ఆ సామెతను నా నోటితో పూర్తిగా చెప్పను కానీ, మీకు అర్థమైందని అనుకుంటున్నాను’ అని మంచు లక్ష్మి అన్నారు. ఆడవాళ్లు ఇలాగే ఉండాలి, ఇలాగే ప్రవర్తించాలి అని ఎవరు రాశారని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆమె ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.. ‘నా పెళ్లి సమయంలోనే నా భర్తకు ఒక మాట చెప్పాను. నువ్వు ఏ పని చేస్తావో.. అదే పని నేను కూడా చేయగలను అని గుర్తుంచుకోమన్నాను. దాంతో ఆయన ఏదైనా చేయడానికి జంకుతాడు. నేను చేస్తే తను కూడా చేస్తుందనే భయం ఆయన మనసులో ఉంటుంది’ అని లక్ష్మి పేర్కొన్నారు. అలా మహిళలు కూడా తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Ghattamaneni Aadiseshagirirao : పద్మాలయ స్టూడియోస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే భాద్యత జై కృష్ణపై ఉంది
-
CWG 2026 Medals: ఒక్క రోజులో 16 పతకాలు.. పాయింట్స్ పట్టికలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్.!
-
Kangana Ranaut: “మంటకు ఆజ్యం పోయవద్దు!” హృతిక్‌పై విరుచుకుపడిన కంగనా రనౌత్
-
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొడుతున్న భారత్.. 39 పతకాలతో టాప్-4లోకి ఇండియా!
-
Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
ట్రెండింగ్
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!