యంగ్ హీరో లక్ష్ చదలవాడ సెకండ్ ఇన్నింగ్స్ లో పూర్తిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నాడు. అలా వచ్చిన చిత్రాలే ‘వలయం’, ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. ఆ రెండు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో ఇప్పుడు అదే జోష్ లో మరో ప్రాజెక్టులో భాగమవుతున్నారు లక్ష్ చదలవాడ. ‘ధీర’ అనే పేరుతో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సరికొత్త కథాంశంతో ఈ ‘ధీర’ సినిమా తెరకెక్కుతోంది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రాబోతోంది. పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు. ‘ధీర’ సినిమాకు సంబంధించి ఇది వరకు విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.
తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. హీరో లక్ష్ చదలవాడ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 9న ఉదయం 9 గంటలకు ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ క్రమంలో ‘ధీర’ ప్రీ లుక్ రిలీజ్ చేశారు. దీనిని చూస్తుంటే ఈ మూవీలో యాక్షన్ కు లోటు లేదనిపిస్తోంది. నేహా పతన్, సోన్యా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడీ, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.