kusukuntla prabhakar reddy nomination today
ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు మేనియా నడుస్తోంది. తెలంగాణ ప్రజలతో పాటు పాటు దేశవ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నికపై ఎంతో ఆసక్తి నెలకొంది. మునుగోడు ఉప ఎన్నికలో మరోసారి గెలిచేందుకు ఈ సారి బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. అయితే.. మునుగోడు కాంగ్రెస్ కోట అంటూ.. కాంగ్రెస్ అభ్యర్థినే గెలపించాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఇదిలా ఉంటే.. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌కు ప్రత్యేకమైంది. దీంతో అధికార టీఆర్‌ఎస్ సైతం ఈ మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.
అయితే.. ఇప్పటికే మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి లు నామినేషన్లు దాఖలు చేశారు.. ఈ క్రమంలో నేడు టీఆర్‌ఎస్ తరుఫున బరిలోకి దిగనున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. అయితే.. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. అయితే.. రేపటితో నామినేషన్ ప్రక్రియకు తెరపడనుంది. అయితే.. 17న నామినేషన్ విత్‌డ్రా ఉండనుంది. వచ్చేనెల 3న పోలింగ్, 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు.