తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ఖుషి.విజయ్ దేవరకొండ మరియు సమంత ఇద్దరు కూడా సినీ కెరీర్ లో ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు.విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తో అలాగే సమంత శాకుంతలం సినిమా తో భారీ ప్లాప్ లను అందుకున్న సంగతి తెలిసిందే.. మరి ఈ ప్లాప్ లను అందరూ మర్చిపోవాలంటే భారీ హిట్ సినిమా ను అందించాలి.అందుకే ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న ఖుషి సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నారు.శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా వున్నాయి.
సమంత, విజయ్ దేవరకొండ కలిసి జంట గా నటిస్తున్న ఈ సినిమా షూట్ కూడా శర వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో నే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఫస్ట్ సింగిల్ విడుదల కాగానే చార్ట్ బస్టర్ గా నిలిచింది. హేషమ్ అబ్దుల్ అందించిన సంగీతం మ్యూజిక్ లవర్స్ విశేషంగా ఆకట్టుకోవడం తో ఈ సాంగ్ క్రేజ్ ఇంకా పెరుగుతూనే ఉంది.. ఇప్పుడు ఈ సాంగ్ ఏకంగా 60 మిలియన్ వ్యూస్ ను రాబట్టినట్లు సమాచారం.. ఈ క్రమంలోనే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేస్తూ యూట్యూబ్ లో 60 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసిందని అలాగే ఇంస్టాగ్రామ్ రీల్స్ లో 550K వ్యూస్ ను క్రాస్ అయ్యిందని చెబుతూ ఒక పోస్ట్ ను చేసారు.. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతున్నట్టు ఈ మధ్య నే ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయి లో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.త్వరలోనే ఈ సినిమా నుంచి రెండవ పాటను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.