రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, పార్టీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్న పార్టీ అధినేత కేసీఆర్ తలుపులు మూసుకొని కూర్చుంటున్నారని విమర్శించారు సీపీఐ రాష్ట కార్యదర్శి కూనం నేని సాంబశివరావు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని అనుకున్న కేసీఆర్ దానికి సిద్ధంగా లేరని అనిపిస్తుందని, ఒకవేళ బీఅర్ఎస్ పార్టీ కలిసి రాకపోతే మేమే ఒంటరిగా పోటీ చేస్తామన్నారు.
Also Read : SP Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందూజా కన్నుమూత
అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. తలుపులు బిగించుకునే కూర్చు నే బదులు ప్రజా సమస్యలను పరిష్కరించాలని చూచించారు. కర్ణాటక ఎన్నికలతో బీజేపీకి గుణపాఠం వచ్చిందని, బీజేపీకి వ్యతిరేకంగా నడిచే ఏ పార్టీ కైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా కూటమిని ఏర్పాటు చేయడం అసాధ్యం అని థర్డ్ ఫ్రాంట్ అనే విషయాన్ని రాజకీయ పార్టీలు మానుకోవాలని సూచించారు.
Also Read : DC vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న పంజాబ్ కింగ్స్