ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో సీపీఐ పోటీ చేస్తుందని వెల్లడించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో ప్రజా సమస్యలపై తమ వాణి వినిపించేందుకు మూడు నుండి ఐదు సీట్లలో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు కూనంనేని సాంబశివరావు. సీపీఐ పార్టీ అభ్యర్థిపోటీ చేసే వైరాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. వైరా, కొత్తగూడెం, హుస్నాబాద్ తో పాటు మరికొన్ని స్థానాలలో సీపీఐ అభ్యర్థులు ఈసారి బరిలో ఉంటారని కూనంనేని సాంబశివరావు తెలిపారు.
Also Read : Viral : ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం.. పోలీస్ జీప్‌పై డ్యాన్స్
వామపక్ష పార్టీల ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కొంతమంది తప్పుడు కూతలు కూస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ హటావో దేశ్ కి బచావో నినాదంతో వచ్చేనెల నాలుగో తేదీన కొత్తగూడెంలో జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయండని ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో సీపీఐ పార్టీ పునాదులను కదిలించడం ఎవరు తరం కాదని, కేంద్రంలో పిచ్చి తుగ్లక్ పాలన కొనసాగుతుంది పిచ్చివాడి చేతిలో రాయిలా ప్రధాని మోడీ ప్రవర్తిస్తున్నాడంటూ ఆయన విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రకు ప్రయత్నిస్తున్నారని, మతతత్వ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏ పార్టీతోనైనా సరే కలిసి పోటీ చేస్తామన్నారు. పిచ్చి తుగ్లక్ కు వారసుడు నరేంద్ర మోడీ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది నుండే బీజేపీ పతనం మొదలైందని, తెలంగాణలో కూడా బీజేపీ గాలి బుడగ లాంటిదన్నారు. ప్రజా సమస్యలపై రాష్ట్ర స్థాయిలో కేంద్రంలో కూడా సీపీఐ తన పోరాట పటిమనుకొనసాగిస్తుందన్నారు.
Also Read : Thalapathy68: అక్కినేని వారసుడుకు ప్లాప్ ఇచ్చినా మంచి ఛాన్సే పట్టేశాడే