Rashid Khan Marriage: ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో రషీద్ పెళ్లి చేసుకున్నారు. ఆఫ్ఘన్ స్పిన్నర్ వివాహం పష్తూన్ ఆచారాల ప్రకారం జరిగింది. గురువారం (అక్టోబర్ 3) రషీద్ వివాహం చేసుకున్నారు. అఫ్గానిస్థాన్ క్రికెటర్లంతా అతని వివాహానికి హాజరయ్యారు. రషీద్ పెళ్లికి సంబంధించిన చిత్రాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Train Derailed: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన పెట్రోలియం ఉత్పత్తులతో వెళ్తున్న గూడ్స్ రైలు!
సమాచారం ప్రకారం, రషీద్‌తో పాటు అతని ముగ్గురు సోదరులు కూడా వివాహం చేసుకున్నారు. బంధువుల కారణంగానే రషీద్ పెళ్లి చేసుకున్నట్లు కూడా కథనాలు వస్తున్నాయి. అయితే., అతను పెళ్లి చేసుకొను అనే ఓ పెద్ద వాగ్దానాన్ని బ్రేక్ చేశాడు. దీనికి కారణం.. కొన్ని సంవత్సరాల క్రితం, రషీద్ తన ఇంటర్వ్యూలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే, 2024లో అఫ్ఘానిస్థాన్ తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకోవడం గమనార్హం.
Fastag Recharge Rules Change: ఫాస్టాగ్ రీఛార్జ్ నియమాలలో మార్పు.. గమనించారా?
ఇక రషీద్ ఖాన్ పెళ్లికి ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆడుతున్న అతని సహచర క్రికెటర్లందరూ హాజరయ్యారు. జట్టు వెటరన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ, ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ లు కూడా కనిపించాడు. నజీబుల్లా జద్రాన్, రహమత్ షా, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లతో సహా అనేక ఇతర తారలు రషీద్ పెళ్లిలో కనిపించారు. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో నసీబ్ ఖాన్ కూడా రషీద్ వివాహానికి హాజరయ్యారు.
Historical Night 🌉
Kabul is hosting the wedding ceremony of the prominent Afghan cricket star and our CAPTAIN 🧢 Rashid Khan 👑 🇦🇫 @rashidkhan_19
Rashid Khan 👑 and his three brother got married at same day.
Wishing him a and his thee brother happy and healthy life ahead! pic.twitter.com/YOMuyfMMXP
— Afghan Atalan 🇦🇫 (@AfghanAtalan1) October 3, 2024