Site icon NTV Telugu

KTR : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే హామీలు అమలు చేస్తారు.. కేటీఆర్ ట్వీట్

Kavitha Ktr

Kavitha Ktr

KTR : కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామలను అమలు చేయాలంటే.. జూబ్లీహిల్స్ లో ఓడించాలన్నారు. అలా ఓడిస్తేనే ఆ పార్టీకి భయం పట్టుకుని హామీలను అమలు చేస్తుందన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా ఓడించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అందుకే పార్టీ పరువును కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోందని ట్వీట్ చేశారు.

Read Also : Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు..

‘జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆపదమొక్కులు మొక్కుతున్నది. అందులో భాగంగానే సినీ కార్మికులకు వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడిగా తిరగడం లాంటివి కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన డిపాజిట్‌ను కోల్పోయేలా ప్రజలు చేసినప్పుడు మాత్రమే 2023లో వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారని కేటీఆర్ తెలిపారు.

Read Also : Husnabad : కలెక్టర్ కాళ్లపై పడి ఏడ్చిన మహిళా రైతు.. నీళ్లలో కొట్టుకుపోయిన ధాన్యం

Exit mobile version