Site icon NTV Telugu

KTR: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..

Cm Revanth

Cm Revanth

శాస‌న‌స‌భ‌లో పంచాయ‌తీ రాజ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీల కోసం గతంలో కేసీఆర్‌ అనేక పోరాటాలు చేశారు.. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి.. తిరిగి తెలంగాణలోనే అడుగు పెడతా అని చెప్పిపోయిండు సాధించిండు కేసీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే.. బీసీ బిల్లు సాధించుడో.. లేకపోతే ఢీల్లీ నుంచి తెలంగాణకు రాను అని అక్కడే జంతర్ మంతర్ లో కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేయమనండి అని తెలిపారు. ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ ఇస్తలేరు అని సీఎం రేవంత్ అంటున్నారు.. ఎందుకు ఇస్తలేరు.. సీఎం స్వయంగా చెప్తున్నరు అపాయింట్ మెంట్ ఇస్తే చెప్పులెత్తుకపోతరేమోనని ఇస్తలేరని అంటున్నడు.

Also Read:Telanagana Assembly: గంగుల కమలాకర్ పై మంత్రులు సీరియస్..

ఇట్ల మాట్లాడాకా అపాయింట్ మెంట్స్ వస్తయా అని ప్రశ్నించారు. భాష మార్చుకో.. బుద్ధి మార్చుకో అని కేటీఆర్ సూచించారు. బీసీ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మొట్టమొదటి స్పీకర్‌గా బలహీనవర్గాల బిడ్డ మధుసూదనాచారిని, శాసన మండలి తొలి ఛైర్మన్‌గా స్వామిగౌడ్‌ను నియమించాం. అడ్వకేట్‌ జనరల్‌గానూ బలహీనవర్గానికి చెందిన బీఎస్‌ ప్రసాద్‌ను భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం నియమించింది. కె.కేశవరావు, డి.శ్రీనివాస్‌ (డీఎస్‌), బండా ప్రకాశ్‌, లింగయ్య యాదవ్‌, వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభకు నామినేట్‌ చేశాం అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Also Read:Rashmika : మరో హారర్‌ చిత్రంలో రష్మిక?

అంతకు ముందు అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారు.. తెరవెనుక లాబీయింగ్ చేసి బిల్లును రాష్ట్రపతికి పంపించేలా చేశారు.. బీసీ రిజర్వేషన్లపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దుఖంతో ఉన్నారు.. బీసీ రిజర్వేషన్లపై హరీష్ రావు, కేటీఆర్ కడుపు నిండా విషం పెట్టుకుని ఉన్నారు.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాం.. కానీ బీఆర్ఎస్ మాత్రం మద్దతు తెలపలేదు.. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్ కు లేదు.. మేము సహకరించం, మా బుద్ధి మారదు అంటే.. ప్రజలే సమాధానం చెప్తారు.. మీరు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు.. ముందు మీ నాయకుడిని సభకు రమ్మనండి.. కేసీఆర్ సభకు రాడు.. వచ్చిన వాళ్లు ఇలా ఉన్నారు.. కల్వకుంట్ల కాదు.. కలవకుండా చేసే కుటుంబం.. అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

Exit mobile version