KTR : ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోర్త్ సిటీ పేరుతో తన సోదరులకు వేల కోట్లు లబ్ధి చేసే కుట్ర అని, ఫార్మాసిటీ వ్యవహారంలో ప్రభుత్వం పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫార్మాసిటీ ఉన్నట్టా? లేనట్టా స్పష్టం చేయండని, కోర్టులో మాత్రం ఫార్మాసిటీ కొనసాగుతుందంటూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తే రైతుల భూమి వారికి అప్పగించాలని, ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సహా మంత్రులు చాలా సందర్భాల్లో ప్రకటించారన్నారు. అదే నిజమైతే రైతుల నుంచి సేకరించిన భూమిని వారికి తిరిగి ఇచ్చేయాలని, ఇదే ప్రభుత్వం ఒకవైపు ఫార్మాసిటీ రద్దు చేశామంటూనే…హైకోర్టులో మాత్రం ఫార్మాసిటీ రద్దు కాలేదని చెబుతోందన్నారు కేటీఆర్. ఫ్యూచర్ సిటీ, ఏఐ సీటీ, ఫోర్త్ సిటీ అంటున్నారు. దాని కోసం ఒక్క ఎకరం భూమినైనా సేకరించిరా? ఒక్క ఎకరాం సేకరించకుండా ఫార్మా సిటీ భూములను ఇతర అవసరాలకు ఎలా మళ్లిస్తారు? అని ఆయన ప్రశ్నించారు.
Arunachal Pradesh: 21 మందిపై లైంగిక దాడికి పాల్పడిన వార్డెన్‌కు మరణశిక్ష!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
అంతేకాకుండా..’ఏ విధంగా హైకోర్టును, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తారు. ఫార్మా సిటీ వెనకు వేల కోట్ల భూ కుంభకోణం ఉంది. అన్ని వివరాలను త్వరలోనే బయటపెడతాం. నీ అన్నదమ్ములకు వేల కోట్ల రూపాయల లబ్ది చేసే కుట్ర చేస్తున్నావ్. ఫార్మా సిటీ ఉన్నట్టా? లేనట్టా? ఈ ప్రభుత్వం రేపు హైకోర్టులో స్పష్టం చేయాలి. 14 వేల ఎకరాలల్లో, 64 వేల కోట్ల పెట్టుబడులతో మేము ఫార్మాసిటీ ని ప్రతిపాదించాం. అందుకోసం కండిషనల్ ల్యాండ్ అక్విజేషన్ ను చేశాం. ఆ భూములను ఇతర అవసరాలకు మళ్లించే అవకాశం లేదు. అలా భూములను ఇతర అవసరాల కోసం మళ్లించి వేల కోట్ల స్కాం చేయాలని ప్రయత్నిస్తున్నారు.
ఫార్మాసిటీ ఉంటే 14 వేల ఎకరాలు ఉండాలే. లేదంటే రైతులకు భూములు తిరిగి ఇచ్చేయాలి.’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Godhra Train Burning Case: “గోద్రా రైలు దహనం”పై జనవరి 15న సుప్రీంకోర్టు విచారణ..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!