Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: స్థానిక సంస్థ ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు.. నామినేషన్ దాఖలు సమయంలో అవసరమైన సర్టిఫికెట్లు సమర్పించకపోతే నామినేషన్లు ఆమోదం పొందవని తెలిపిన ఆయన.. అయితే, తమ పార్టీ అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నామినేషన్ స్థాయిలోనే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే అధికారులు తమ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. తహసీల్దార్లకు ఫోన్ చేసి సర్టిఫికెట్లు ఇవ్వొద్దని సూచించే స్థాయికి ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. సర్టిఫికెట్లు వెంటనే జారీ చేయాలని కలెక్టర్‌ను కోరామని, చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా నామినేషన్లు తిరస్కరిస్తే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత గణనీయంగా పెరిగిందని, వైసీపీకి ప్రజాదరణ పెరుగుతోందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిజాయితీగా జరిగితే చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఇక, తాడేపల్లిలో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి తమ ప్రభుత్వ హయాంలో రెండు ఎకరాల భూమి కేటాయించామని అంబటి తెలిపారు. భవనం నిర్మాణం పూర్తయ్యే దశలో ఉండగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కోర్టు నోటీసులు ఇవ్వాలని చెప్పినా ఆదేశాలను పట్టించుకోలేదని విమర్శించారు.
Also Read
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
స్థలాన్ని స్మశాన వాటిక కోసం వెనక్కి తీసుకుంటామని తహసీల్దార్ నోటీసు ఇచ్చారని అంబటి తెలిపారు. చంద్రబాబు ఇంటికి అనుమతులు లేవని, అయితే ఆయన కోర్టును ఆశ్రయించి ఇంటి కూల్చివేతను అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యాలయ భూమి, సర్టిఫికెట్ల అంశాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!