తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేవపెట్టారు. అయితే.. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం దేశంలో అనేక పోరాటాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కట్టుబడినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా, ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం తనకు అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను మేము అడ్డుకున్నట్టు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. వర్గీకరణపై కాంగ్రెస్సే పోరాడినట్టు చిత్రీకరిస్తున్నారని, 2014 నవంబర్ 29న కేసీఆర్ ఎస్సీ వర్గీకరణపై తీర్మానం పెట్టారని ఆయన వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని కేటీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం ను స్వాగతిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అంతేకాకుండా.. బీసీలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
CPM Srinivasa Rao: సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు..
‘బీసీల సంఖ్యను ఐదు శాతం తగ్గించి బీసీల గొంతు కోసిన ప్రభుత్వ కుట్రను నిరసనగా వాకౌట్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభాను తగ్గించిన తీరును రాష్ట్రంలోని బలహీన వర్గాలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి వాదనను, భాదను అసెంబ్లీలో తెలుపుదామంటే ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. బలహీన వర్గాల అంశానికి సంబంధించి బలహీన వర్గాల వాదనను అసెంబ్లీలో వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన దగాను మోసాన్ని… గొంతు కోసిన తీరును నిరసిస్తూ శాసనసభ నుంచి వాకౌట్ చేస్తున్నాము’ అని కేటీఆర్ అన్నారు. అనంతరం అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
NBK 111: గోపీచంద్ తోనే బాలకృష్ణ నెక్స్ట్.. అంతా సెట్!