BRS Rythu Dharna: ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ అమలు చేశారు: కేటీఆర్
- షాబాద్‌లో బీఆర్‌ఎస్ రైతు ధర్నా
- రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
- సంవత్సర కాలంగా చూసిన బెస్ట్ జోకును ఈరోజు పేపర్లో చూశా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అస్సలు వదిలి పెట్టొద్దని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ అమలు చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఒక్క ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయితే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని సవాల్ విసిరినా సీఎం మాట్లాడలేదని కేటీఆర్ పేర్కొన్నారు. చేవెళ్లలో ఉప ఎన్నిక రాబోతుందన్నారు.
శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ‘రైతు ధర్నా’ చేపట్టింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘గత సంవత్సర కాలంగా చూసిన బెస్ట్ జోకును ఈరోజు పేపర్లో చూశాను. తెలంగాణను ఉద్ధరించాను, ఢిల్లీని ఉద్దరిస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి రాజధానిలో చెబుతున్నాడు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు చేయలేదు కానీ.. ఢిల్లీలో చేస్తాను అంటున్నాడు. ఫ్రీ బస్ తప్ప ఇచ్చింది ఏమీ లేదు. ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ అమలు చేశారు’ అని కేటీఆర్ విమర్శించారు.
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్‌ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
Also Read: Jeevan Reddy: రైతు భరోసా ప్రభుత్వం ప్రకటించినా.. బీఆర్‌ఎస్ రైతు ధర్నా అంటూ డ్రామా చేస్తోంది!
‘రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టొద్దు. ఒక్క ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని సవాల్ విసిరాను. తెలంగాణలో ఏ ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయితే.. మా ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తామాని చెప్పాను. అయినా కానీ సీఎం మాట్లాడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు నాట్లు వేసే సమయానికి డబ్బులు పడుతుండేవి. కానీ రేవంత్ రెడ్డి ఓట్ల అప్పుడు రైతులకు డబ్బులు ఇస్తాను అంటున్నాడు. చేవెళ్లలో ఉప ఎన్నిక రాబోతుంది. మీరు చేవెళ్లలో కేసీఆర్ కు ఓటేశారు, ఎమ్మెల్యేని గెలిపించారు. కానీ చేవెళ్ల ఎమ్మెల్యే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఎవరి అభివృద్ధి కోసం వెళ్ళాడో అందరికీ తెలుసు. చేవెళ్లలోనే కాదు తెలంగాణలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 2025లోనే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు వస్తాయి. వాళ్ళను ఓడించాలి. రైతుల తరుపున ఇది ఆరంభం మాత్రమే. 21వ తారీఖున నల్గొండలో మరో రైతు దీక్ష పెడతాం’ అని కేటీఆర్ తెలిపారు.
తాజావార్తలు
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..