తెలంగాణ రాష్ట్రంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అస్సలు వదిలి పెట్టొద్దని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ అమలు చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఒక్క ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయితే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని సవాల్ విసిరినా సీఎం మాట్లాడలేదని కేటీఆర్ పేర్కొన్నారు. చేవెళ్లలో…
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు రైతుల పక్షాన పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతుభరోసా మోసాలపై ‘ రైతు ధర్నా’ పేరుతో బీఆర్‌ఎస్ పోరాటానికి సిద్దమైంది. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు కాకపోవడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ రైతు ధర్నా, నిరసన…