KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఫార్ములా ఈ రేస్ నిర్వహించామని, అందులో అవినీతి జరిగిందని తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ కారు రేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేసులకు భయపడము.. న్యాయవ్యవస్థలపై తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు. పోలీసులు ఎంత వేధించిన ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయవ్యవస్థ తమకు వెన్నుదన్నుగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తమిళనాడు సీఎం విజయ్ ఫార్ములా ఈ రేస్ కోసం లండన్ వెళ్లారని.. పక్క రాష్ట్రాలు బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం లండన్ వెళ్తుంటే ఇక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. టార్గెట్ కేసీఆర్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు.. లక్ష కోట్లు సంపాదించామని కాంగ్రెస్ ప్రభుత్వం తమపై అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. “లక్ష కోట్లు కొల్లగొట్టామని రేవంత్ రెడ్డి అంటున్నారు.. రేవంత్‌కు మంచి ఆఫర్ ఇస్తున్నా.. రూ. 1000 కోట్లు ఇచ్చి మా పేరుపై ఉన్న లక్ష కోట్లు ఆస్తులు తీసుకోండి. మిగిలిన 99 వేల కోట్లు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకోసం ఖర్చు చెయ్యండి.. కాళేశ్వరంలో లక్ష కోట్లని ప్రచారం చేసినట్లుగానే ఇప్పుడు విషప్రచారం చేస్తున్నారు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read
- Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
- Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
తాజావార్తలు
-
KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
-
Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
-
Team India Histroy: టీ20 క్రికెట్లో భారత్ వరల్డ్ రికార్డు.. ఇక ఆస్ట్రేలియా అందుకోలేదుగా!
-
Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?