అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు అవయవ దానం బిల్లును ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అవయవ దానానికి ముందుకొచ్చారు. అవయవదానానికి తాను సిద్ధంగా ఉన్నట్లు అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించారు. సంబంధిత బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘మనం ప్రజా ప్రతినిధులం.. అందరికీ ఆదర్శంగా నిలవాలి. నియోజకవర్గాల్లోనూ అవయవ దానంపై చైతన్యం తేవాలి’’ అని కేటీఆర్ అన్నారు.
READ MORE: Salman Khan : చావు ని ఎవ్వరు ఆపలేరు..
రాష్ట్రంలో అవయవ దానానికి అందరినీ ప్రోత్సహించే బాధ్యత ప్రజాపతినిధులుగా అందరిపై ఉందని చెప్పారు. ఈ విషయంలో పార్టీ అందరి తరఫున తాను మాట్లాడటం లేదని.. వ్యక్తిగతంగా తాను అవయవ దానానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ప్రకటించారు. స్పీకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఆవరణలో అవయవ దానంపై పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ నిర్వహించాలని కోరారు. అన్ని నియోజకవర్గాల్లోనూ అవయవ దానంపై క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టాలని.. అవయవదానం పత్రంపై ఎమ్మెల్యేగా తాను మొదటి సంతకం పెడతానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే బిట్లుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. “ట్రాన్స్ ప్లాంటేషన్ ను ఆరోగ్య శ్రీ లో చేయండి. అవయవ దానం చేసిన వారికి ప్రభుత్వ లాంఛనాల తో చేస్తే బాగుంటుంది. ఆ గౌరవం కోసం అయినా అవయవ దానం కి ముందుకు వస్తారు.” అని సూచించారు.
READ MORE: New Excise Police Stations:14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు లైన్ క్లియర్.. ఒకటి నుంచి షురూ..