ఏప్రిల్ 7, 8 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు వల్ల 83 మంది బాధితులు ఆస్పత్రి పాలయ్యారని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు. ఆల్ఫాజోలం కలిపినా కల్లు తాగడం వల్ల అస్వస్థత లోనయ్యారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీజీఎన్‌ఏబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కల్తీ కల్లుపై తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావించినట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమాల కోసం 26 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Bhu Bharathi: నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో నేడు భూ భారతి పైలట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. భూ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే కాకుండా, రైతులకు భూమిపై పూర్తి హక్కులను బలపరచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు, నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. గ్రామస్థాయిలో…
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు అవయవ దానం బిల్లును ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అవయవ దానానికి ముందుకొచ్చారు.
Minister Seethakka : వచ్చే ఐదు నెలల కోసం మిషన్ భగీరథ సిబ్బంది ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు మంత్రి సీతక్క. వేసవి ముగిసే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె వ్యాఖ్యానించారు. గాలి తర్వాత నీరే మనుషులు కావాలన్నారు. కోట్ల మందికి నీరందించే అదృష్టం మనకే దక్కిందని, ప్రతి మనిషికి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు అందించాల్సిందే అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. గ్రామస్థాయిలో మండల స్థాయిలో క్రీమ్ కమిటీ వేసుకోండని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి…
మంత్రి సీతక్క ఆదేశాలతో వరంగల్ జిల్లా జంగాలపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్ చేశారు అధికారులు. RWS నీటి పరీక్షలు ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాల వల్ల సుమారుగా 17 మంది చనిపోవడం జరిగింది.