Mukesh Ambani: దేశంలో పాటు విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంలో గాంధీనగర్ వేదికగా ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’ జరుగుతోంది. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పలువురు గుజరాత్‌లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి రిలయన్స్ ఇండస్ట్రీన్ అధినేత, దేశంలో కుబేరుడిగా పేరున్న ముఖేష్ అంబానీ కూడా హాజరయ్యారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ముఖేష్ అంబానీకి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. వైబ్రంట్ గుజరాత్ ఈవెంట్ లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ‘ముఖేష్ కాకా’ అని పిలవడంతో ఆయన వెనక్కి తిరిగి చూసి ఓ చిరునవ్వు నవ్వుతూ, అతనికి అభివాదం చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బిలియనీర్ నుంచి వచ్చిన ఈ రియాక్షన్ నెటిజన్లను కట్టిపడేస్తోంది. దీనిపై కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: Akash Missile: న్యూ జనరేషన్ “ఆకాష్ మిస్సైల్” ప్రయోగం సక్సెస్..
‘‘ ముఖేస్ అంబానీ భవనంలోకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కనే గుంపులోని ఓ వ్యక్తి ‘ముఖేష్ కాకా’ అని అరిచాడు. దీంతో ముఖేష్ అంబానీ ఆ వ్యక్తి చూసేందుకు వెనక్కి తిరిగారు. ఒక చిరునవ్వు నవ్వారు.’’ ఈ పోస్టు జనవరి 11న వచ్చింది. దీనిని ఇప్పటి వరకు మూడు లక్షల మంది చూశారు.
దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘‘సాధారణ గుజరాతీ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు’’అని ఒకరు రాయగా.. ‘‘ ముఖేష్ అంబానీ చాలా మంచి వ్యక్తి, సో హంబుల్, సో స్వీట్’’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. చాలా మంది స్మైలింగ్ ఎమోజీతో ఈ వీడియోపై స్పందిస్తున్నారు.
Some one called “Mukesh Kaka” and typically Gujarati always smile 😁😁
— विजय (@bijjuu11) January 11, 2024