KTR: కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపించారు. వీరితోపాటు పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్స్‌కు మరోసారి లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో తనపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తామని నోటీసుల్లో కేటీఆర్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేస్తే ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే తేల్చిచెప్పారు.
Read Also: Kodanda Reddy: పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్‌ను బదనాం చేస్తున్నారు..
Also Read
- Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
- AP Assembly Sessions: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్‌నినోపై చర్చ!
- TVK Vijay Government: విజయ్ ప్రభుత్వానికి 100 రోజులు.. “డమ్మీ సీఎం” అంటూ విమర్శలు..!
- Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలు ప్రారంభం.. తొలి కమర్షియల్ ఫ్లైట్‌గా ఇండిగో!
ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏమాత్రం సంబంధం లేకపోయినా. పదే పదే తన పేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్న వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు వారికి లీగల్ నోటీసులు పంపించారు. తనకు సంబంధం లేని అంశంలో తన పేరును, తమ పార్టీ పేరును ప్రస్తావిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి కొండా సురేఖ ఇప్పటికే తేల్చి చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నా సురేఖ.. లీగల్ నోటీసులు ఇచ్చినా ఎదుర్కొంటామని, అందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే విచారణలో తేలితే తప్పని సరిగా శిక్షకు అర్హులేనని చెప్పారు. కేటీఆర్ భయంతో ఏదేదో దిగజారి మాట్లాడుతున్నారని సురేఖ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Lakshmi Mittal Steel Plant: లక్ష్మీ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌పై రష్యా దాడి.. ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు
-
Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
-
Alias Rukmini: నితిన్ కోసం రంగంలోకి దిగిన నాని.. ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్‌కు రెడీ!
-
El Nino: నెమ్మదిగా వేడెక్కుతున్న పసిఫిక్ జలాలు.. ప్రమాదం ముంచుకొస్తోందా?
-
Prabhas : ‘ఫౌజీలో ఈ సీన్ ఎంత బాగా తీశాడంటే’.. హను వర్క్ పట్ల సన్నిహితులతో ప్రభాస్
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?