తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ కార్యకర్తలతో సమావేశమయ్యారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ తో పాటు సమావేశంలో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ తయారు చేసిన క్యాడర్ ఇక్కడికి వచ్చింది.. మాగంటి గోపినాథ్ మూడు సార్లు మీ ఆశిస్సులతో గెలిచాడు.. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రజలు కాంగ్రెస్ నాయకులను ఒక్కరిని నమ్మలేదు.. ఒక్కరిని కూడా బిఆర్ఎస్ మినహా ఎవరిని అసెంబ్లీ కి పంపలేదు..
Also Read:Nepal: సాధారణ స్థితికి నేపాల్.. ముగ్గురు మంత్రులతో కేబినెట్ విస్తరణ
అడ్డుమారి గుడ్డి సూటిగా బీజేపీ కి ఒక్క సీటు వచ్చింది.. కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలను హైదరాబాద్ ప్రజలు నమ్మలేదు.. కేవలం గ్రామాల ప్రజలు కాంగ్రెస్ చూపించిన అరచేతిలో వైకుంఠాన్ని చూసి మోసపోయారు.. కెసిఆర్ చేసిందాని కంటే ఎక్కువ చేస్తామని చెప్పారు కాంగ్రెస్ నాయకులు.. 120 ఏళ్ల చరిత్ర మాది.. మేము తప్పా ఇంకెవ్వరూ చేయారని డైలాగులు కొట్టారు.. ఆ డైలాగులకు కొందరు నమ్మి వాళ్లకు అవకాశం ఇచ్చారు.. కేవలం 1.8% తేడాతో.. నాలుగైదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు..
నాలుగు కోట్ల మందిలో నాలుగైదు లక్షల తేడాతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. గెలిచినా 23 నెలల్లో కాంగ్రెస్ ఏమి చేసిందో చూస్తే.. మాకంటే మీకే ఎక్కువ తెలుసు.. కోడలు వస్తే 2500 వస్తాయని అత్త అనుకుంటే.. 4 వేల పెన్షన్ వస్తుందని కోడలు అనుకుంది.. తులం బంగారం వస్తుందని అత్తగారు అనుకున్నారు.. కాంగ్రెస్ హామీలతో అందరి మధ్య పంచాయితీ పెట్టాడు.. కాంగ్రెస్ జూటా మాటలు హైదరాబాద్ ప్రజలు నమ్మలేదు.. రాష్ట్రంలో ఎన్నికల ముందు హామీల జాతర ఉండేది..
ఇప్పుడు యూరియా కోసం చెప్పుల జాతర కనిపిస్తుంది.. మొత్తం కాంగ్రెస్ వాళ్ళు యూరియా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు.. మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్మెన్ లారీ యూరియా తీసుకెళ్ళాడట.. మళ్ళీ రేపు వెంగళ రావు నగర్ కు తులం బంగారం ఇస్తాం అని వస్తారు.. తులం బంగారం కాదు.. మీ మేడలో ఉన్న పుస్తెల తాడు గుంజుకుపోకపోతే వాల్లే గొప్పోళ్ళు.. తులం బంగారం కాదు.. తులం ఇనుము కూడా ఇవ్వరు.. మీ మెడల పుస్తెల తాడు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి..
Also Read:Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. దిగొచ్చిన బంగారం ధరలు!
నాలుగు వేల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది.. కెసిఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తున్నాడు.. మేము ముసలవ్వకూ.. ముసలాయనకు ఇద్దరికీ ఇస్తాం అన్నారు.. మరి వస్తున్నాయా..? నాలుగు వేల పెన్షన్ పత్తా లేదు.. 2500 యాదికి లేదు.. 450 హామీలు కలిపితే నాలుగైదు రాష్ట్రాల బడ్జెట్ సరిపోదని టీవిలో ఉప ముఖ్యమంత్రి ని అడిగారు.. దానికి అయన ఆదాయం పెంచి., అందరికి ఇచ్చిన హామీలను తీర్చుత్తాం అన్నాడు.. రెవిన్యూ పెంచుతాం.. వంద రోజుల్లో హామీలు పూర్తి చేస్తాం అన్నాడు.. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు.. రాజశేఖర్ రెడ్డి ఉన్నపుడు రియంబర్స్మెంట్ పథకం తీసుకోచ్చాడు.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రూ. 3 వేల కోట్ల బకాయి విడిచిపెట్టి వెళ్లారు.. దానితో పాటు తొమ్మిదినరెళ్లలో 17 వేల కోట్లు కట్టినం.. అంతే గాని కాంగ్రెస్ ఉంచిన బాకీ కాంగ్రెస్ వాళ్లే కట్టాలి అని అనలేదు అని గుర్తుచేశారు.