KTR : నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో ఘోరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్గొండ మున్సిపాలిటీలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకర్‌లో మృతదేహం లభించడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నిప్పులు చెరిగారు. ‘నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో ఘోరం’ అంటూ వచ్చిన కథనాన్ని రీట్వీట్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీ మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో ఓ మృతదేహం లభ్యమైంది. దాదాపు పదిరోజులుగా ప్రజలు అవే నీళ్లు తాగుతున్నారు. తాగునీటిలో తేడా కనిపించడంతో మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి స్థానికులు వాటర్ ట్యాంకును పరిశీలించగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అంతకుముందు నాగార్జునసాగర్‌లో మంచినీటి ట్యాంకులో 30 కోతులు పడి చనిపోయాయి. నీళ్ల విషయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై కేటీఆర్ స్పందించారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని విమర్శించారు. కోతల్లేని కరెంట్ ఇవ్వరు… కోతకొచ్చిన పంటకు సాగునీళ్లివ్వరు… కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరు… చివరకు నల్గొండలోని నీటి ట్యాంకులో పది రోజులుగా శవం ఉన్నా నిద్రలేవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వానిది… ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది అని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ పథకంతో దశాబ్దాల తాగునీటి సమస్యను తీరిస్తే… కనీసం నీటిట్యాంకుల నిర్వహణ కూడా వీరికి చేతకావడం లేదన్నారు. ఇదో అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ తీరు మారకపోతే ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు.
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!