NTV Telugu Site icon

KP Vivekananda : రోజురోజుకు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు దిగజారుతోంది

Mla Vivekananda

Mla Vivekananda

KP Vivekananda : తెలంగాణ బీ.ఆర్‌.ఎస్. పార్టీకి కేసుల గురించి ఎటువంటి భయం లేదని, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లైన ఎర్రోళ్ల శ్రీనివాస్, మేడె రాజీవ్ సాగర్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు రోజురోజుకు దిగజారిపోతున్నదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు దోచుకుని కాంగ్రెస్ కేంద్రం లకు పంపిస్తున్నారని, రాష్ట్రాన్ని బంగారు బాతుల్లా ఉపయోగించుకుంటున్నారని అన్నారు.

Indian Railways: భార్యాభర్తల గొడవతో రైల్వేకి రూ.3కోట్లు నష్టం.. ఏం జరిగిందంటే?

తెలంగాణ నుంచి దేశంలో ఎక్కడ ఉన్నా డబ్బులు పంపిస్తున్నారని, ఇటీవల హర్యానా ఎన్నికల కోసం కూడా తెలంగాణ నుంచి డబ్బులు వెళ్లిపోయాయని, ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల కోసం కూడా అలాగే జరుగుతోందని చెప్పారు. బిల్డర్లు, వ్యాపారులను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తన ఇంటి నుంచే కార్యకలాపాలను నడిపిస్తున్నారని, ఇంట్లోనే ప్రాజెక్టుల అంచనాలు తయారు అవుతున్నాయని స్పందించారు.

రేవంత్ రెడ్డి తనకు వచ్చేవన్నీ డబ్బుల పై మాత్రమే దృష్టి సారించారని, “హైడ్రా” పేరుతో బిల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి గురించి ప్రజల ముందుకు తీసుకువస్తామని హెచ్చరించారు. కులగణన సర్వేపై ఎలాంటి చర్చ జరుగట్లేదని, అవసరంలేని సమాచారం అడుగుతున్నారని, ప్రజలు పథకాలు పోతాయని భయపడుతున్నారని అన్నారు. 11 నెలల్లో రేవంత్ రెడ్డి ఒక్క మంచి పనినీ చేయలేదని వ్యాఖ్యానించారు.

Modi-Advani: అద్వానీ ఇంటికి వెళ్లి బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రధాని మోడీ

Show comments