సాధారణంగా ఇంటర్వ్యూలలో స్టార్స్ మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ మాత్రం తప్పుగా మాట్లాడిన ఫ్యాన్ వార్ మొదలవ్వడం ఖాయం. సరిగ్గా ఇదే పరిస్థితి ఇప్పుడు బాలీవుడ్ నటి కృతి సనన్ కు ఎదురైంది. ఆమె ఒక హీరో గురించి చెప్పి, మరో హీరో పేరు చెప్పకపోవడంతో ఆ హీరో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో కృతిని ట్రోల్ చేస్తున్నారు. ఆ హీరో మరెవరో కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు. కృతి తన కెరీర్‌ను తెలుగులో మహేశ్ బాబు సరసన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో మొదలుపెట్టింది. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా, మహేష్ హీరోయిన్‌గా కృతికి మంచి గుర్తింపు మాత్రం లభించింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పటికీ ఆమెను మహేష్ హీరోయిన్‌గానే గుర్తిస్తారు. అయితే
Also Read : Poorna : మా అమ్మ మాట నిజమైంది.. భర్త విషయంలో కన్నీళ్లు పెట్టుకున్న నటి పూర్ణ
ప్రస్తుతం కృతి సనన్ హిందీలో ‘తేరే ఇష్క్ మే’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో యాంకర్ ఆమె ఎత్తు గురించి మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో పొడవుగా ఉన్న హీరోయిన్లు తక్కువ, మీరు చాలా పొడవుగా ఉన్నారు. మీతో నటించిన చాలామంది హీరోలు మీ కంటే తక్కువ ఎత్తు ఉన్నారు కదా?’ అని యాంకర్ అడగగా.. కృతి దానికి సమాధానమిస్తూ.. ‘అవును, నేను ఎత్తుగా ఉంటాను. నాతో నటించిన హీరోల్లో చాలామంది నాకంటే తక్కువ ఎత్తు ఉన్నారు. ప్రభాస్, అర్జున్ కపూర్ లాంటి వారు మాత్రమే నా కంటే ఎత్తుగా ఉంటారు’ అని చెప్పింది. ఈ ఒక్క మాటతోనే మహేశ్ బాబు ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. బాలీవుడ్‌కు వెళ్లకముందే కృతికి లైఫ్ ఇచ్చిన మొదటి సినిమా హీరో మహేష్ బాబు గురించి మాట్లాడకపోవడం, ఆయన పేరును మర్చిపోవడం మహేష్‌ను అవమానించినట్లే అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రోలింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కృతి ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.