New TTD Board: 24 మంది సభ్యులతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 24 మందిని టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమించారు సీఎం వైఎస్ జగన్.. ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను, పొన్నాడ సతీష్, తిప్పేస్వామి, కడప నుంచి మాసీమ బాబు, యానాదయ్య, కర్నూలు నుంచి సీతారామిరెడ్డి, గోదావరి జిల్లాల నుంచి వెంకట సుబ్బరాజు, శిద్దా రాఘవరావు కుమారుడు సుధీర్‌కు చోటు కల్పించారు. అనంతపురం నుంచి అశ్వథామ నాయక్, తెలంగాణ నుంచి శరత్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి భార్య సీతకు అవకాశం దొరికింది. తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్ణాటక నుంచి దేశ్‌పాండే సహా మొత్తంగా 24 మందికి టీటీడీ పాలకమండలిని సభ్యులుగా నియమించారు.. మొత్తం జాబితాను కింద లిస్ట్‌లో చూడవచ్చు.
టీటీడీ బోర్డు సభ్యులు
1. పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఎమ్మెల్యే
2. ఉదయభాను సామినేని, ఎమ్మెల్యే
3. ఎం. తిప్పే స్వామి. ఎమ్మెల్యే
4. సిద్దవటం యానాదయ్య
5. చందే అశ్వర్థ నాయక్
6. మేకా శేషుబాబు
7. ఆర్.వెంకట సుబ్బా రెడ్డి
8. ఎల్లారెడ్డి గారి సీతారామ రెడ్డి
9. గాదిరాజు వెంకట సుబ్బారాజు
10. పెనక శరత్ చంద్రా రెడ్డి
11. రామ్ రెడ్డి సాముల
12. బాలసుబ్రమణియన్ పళనిసామి
13. ఎస్.ఆర్.విశ్వనాథ్ రెడ్డి
14. గెడ్డం సీతారెడ్డి
15. కృష్ణమూర్తి వైద్యనాథన్
16. సిద్ద వీర వెంకట సుధీర్ కుమార్
17. సుదర్శన్ వేణు
18. నెరుసు నాగ సత్యం
19. ఆర్.వి.దేశపాండే
20. అమోల్ కాలే
21. డా.ఎస్.శంకర్
22. మిలింద్ కేశవ్ నార్వేకర్
23. డా. కేతన్ దేశాయ్
24. బోరా సౌరభ్