మధ్యప్రదేశ్‌లో ఓ బాలికను ఆలయానికి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. అనంతరం ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ అత్యాచార ఘటన 2018లో జరిగింది. మైనర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నేరం చేసే సమయానికి నిందితుడి వయస్సు 40 ఏళ్లు.
మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. డిసెంబర్ 11వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఈడీ విచారిస్తున్న ఈ కేసులో.. ఢిల్లీ హైకోర్టు తన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
తన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం తీర్పు పై కృష్ణామోహన్ రెడ్డి స్పందిస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో ఉద్దేశ్వపూర్వకంగా ఎటువంటి సమాచారం దాచిపెట్టలేదని ఆయన పేర్కొన్నారు. డీకే అరుణ కోర్టును తప్పుదోవ పట్టించారని కృష్ణామోహన్ రెడ్డి తెలిపారు. న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉందని.. తప్పుడు అఫిడవిట్ చూపించి తన పైన అనర్హత వేటు అంటూ ప్రచారం చేశారని కృష్ణామోహన్ రెడ్డి చెప్పారు.
కర్ణాటక బీజేపీ మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. గతేడాది మాజీ మంత్రి రాసలీలల సీడీ లీక్ అయ్యి సంచలనం సృష్టించింది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనను శారీరకంగా లొంగదీసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడని, రాసలీలల వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో తమ కుటుంబం పరువు పోయిందని, తనకు ప్రాణహాని ఉందని యువతి మాజీ మంత్రి మీద బెంగళూరులో కేసుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసు విచారించిన స్పెషల్…