Fauji : 1940 బ్యాక్ డ్రాప్ లో ఫౌజీ.. హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా ఉంటుందట
- రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ
- లవ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో 'పౌజీ'
- హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న చిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fauji : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో లవ్ అండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ‘పౌజీ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సీతారామం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హను రాఘవపూడి టేకప్ చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. అతడి మార్క్ లవ్ స్టోరీని హైలైట్ చేస్తూనే భారీ వార్ ఎపిక్ ని తనదైన శైలిలో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా గురించి రచయిత కృష్ణకాంత్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ప్రభాస్-హను సినిమా ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నకు ఆయన స్పందించారు. కథ, కథనాల పరంగా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ చిత్రం అన్నారు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. ఊహించని విధంగా సినిమా ఉంటుందని తెలిపారు. ఈ కథ పూర్తిగా 1940 బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది. హను మార్క్ లవ్ స్టోరీతో పాటు, డ్రామా, భారీ యాక్షన్ సన్నివేశాలూ ఉంటాయి. ఇదంతా దేశ భక్తి అంశాలతో మిళితమై ఉంటుందన్నారు. అంటే ఈ కథ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథ అని తేలిపోయింది. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగానూ ఈ సినిమా తీస్తున్నట్లు తొలుత ప్రచారం జరిగింది.
Read Also:Annamalai: హిందీ భాషపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై అన్నామలై ఏమన్నారంటే..!
Also Read
- India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- SL A vs Ind A: 100వ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
- Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్‌ను అందుకోలేకపోయిన వైభవ్!
తాజాగా రైటర్ క్లారిటీతో కన్ఫాం అయింది. హను రాఘవపూడి గత సినిమా ‘సీతారామం’ ఓ వాస్తవ సంఘటనల స్పూర్తితోనే తెరకెక్కింది. హైదరాబాద్ కోఠిలో దొరికే సెకెండ్ హ్యాండ్ పుస్తకాలను కొనుగోలు చేసే అలవాటు ఉన్న హను ఓ రోజు ఓ పుస్తకాన్ని కొనుగోలు చేశాడు. ఆ పుస్తకం చదువుతోన్న సమయంలో క్రమంలో పేజీల మధ్యలో హనుకి ఓ లేఖ కనిపించింది. ఆ లేఖ అప్పటికీ ఓపెన్ చేసి లేదు. హైదరాబాద్ లో చదువుకుంటోన్న ఓ విద్యార్థికి ఊర్లో ఉన్న తన తల్లి పంపించిన లేఖ అది. ఆ లేఖ స్పూర్తితో సీతారామం కథ రాసుకున్నాడు. పౌజీ కథ వెనుక ఇలాంటి చరిత్ర ఏదైనా ఉందా? అన్నది తేలాలి. ఫౌజీని హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నాడంటే? ఇది భారీ స్పాన్ ఉన్న సినిమా అని తెలుస్తోంది. హీరోయిన్ గా ఇమాన్వి ఇస్మాయిల్ అనే ఓ కొత్త భామను తీసుకోవడం వెనుక ఆసక్తికర విషయం ఉండే ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Read Also:SS Thaman: స్పీకర్లు కాలిపోతే కాలిపోనివ్వండి నాకు సంబంధం లేదు
తాజావార్తలు
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
-
SL A vs Ind A: 100వ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!